లిథువేనియా నూతన ప్రధానమంత్రిగా ఇంగా రుగినియెనె (44) ఎన్నికయ్యారు.
సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు.
2025, ఆగస్టు 26న జరిగిన ఎన్నికలో మాజీ కార్మిక నాయకురాలు, కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన రుగినియెనెను లిథువేనియా పార్లమెంటు ప్రధానమంత్రిగా ఎన్నుకుంది.
ఈ ఎన్నికలో ఆమెకు 78 ఓట్లు పోలవగా ఆమె ప్రత్యర్థికి 35 ఓట్లు వచ్చాయి.
గత సంవత్సరం సాధారణ ఎన్నికలకు ముందు ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు.