స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 2,000 ప్రహార్ 7.62 ఎంఎం లైట్ మెషిన్ గన్ (ఎల్‌ఎంజీ)లను అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ భారత సైన్యానికి అందజేసింది. ఈ గన్‌ల డెలివరీతో మన దేశంలో తేలికపాటి మెషిన్ గన్‌లను దేశీయంగా తయారు చేసి సరఫరా చేసిన తొలి భారీ ప్రైవేటు రంగ సంస్థగా అదానీ డిఫెన్స్ నిలిచింది. ఒప్పందం కుదుర్చుకున్న కాల పరిమితి కంటే చాలా ముందుగా కేవలం 7 నెలల్లోనే తొలి బ్యాచ్‌ను డెలివరీ చేసింది.