శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుత లేజర్ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది.
కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో 2025, ఏప్రిల్ 13న ఈ పరీక్ష జరిగింది. ఈ ఆయుధానికి మార్క్-2(ఏ) డీఈడబ్ల్యూ అని పేరు పెట్టారు.
దీంతో అత్యంత శక్తిమంతమైన లేజర్- డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) వ్యవస్థ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరినట్లయింది.
ఈ అస్త్రాలను అమెరికా, చైనా, రష్యాలు విజయవంతంగా పరీక్షించాయి.
ఇజ్రాయెల్ కూడా వీటిపై ప్రయోగాలు చేస్తోంది.
ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్.. సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్) అభివృద్ధి చేసింది.
దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఇందులో పాలుపంచుకున్నాయి.