Published on Apr 15, 2025
Current Affairs
‘లెజెండ్స్‌ ఆఫ్‌ ఎండోస్కోపీ’ పురస్కారం
‘లెజెండ్స్‌ ఆఫ్‌ ఎండోస్కోపీ’ పురస్కారం

ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి జపాన్‌ పురస్కారం ‘లెజెండ్స్‌ ఆఫ్‌ ఎండోస్కోపీ’ దక్కింది. ఆ దేశానికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఆయనకు 2025, ఏప్రిల్‌ 14న దీన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ వైద్యుడు నాగేశ్వరరెడ్డి. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో ఆయన అందించిన విశేష సేవలతోపాటు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకుగానూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. షోవా విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘టోక్యో లైవ్‌ గ్లోబల్‌ ఎండోస్కోపీ 2025’ వేడుకలో నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేశారు.