సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు భారత్ మొదటిసారి లాంగ్‌రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం)ను సిద్ధం చేసింది. ఈ క్షిపణి పరిధి 1500 కి.మీ. కాగా గంటకు 6,100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీలో అభివృద్ధి చేసిన ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎంను 2024 నవంబర్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇందులో విజయం సాధించడంతో మరో రెండేళ్లలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు.