ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు లోక్‌సభ రహస్యంగా సమావేశం కావడానికి నిబంధనలు అనుమతిస్తాయని రాజ్యాంగ నిపుణుడు వెల్లడించారు.
కానీ చరిత్రలో ఇంతవరకూ ఇలా సభ సమావేశం కాలేదు.
వారు తెలిపిన వివరాల ప్రకారం, 1962లో చైనాతో ఉద్రిక్తతల సమయంలో సభను రహస్యంగా సమావేశపరచాలని కొంత మంది ప్రతిపక్ష సభ్యులు కోరారు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదు.
రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్‌సభ’లోని 25 చాప్టర్.. సభ రహస్యంగా సమావేశం కావడానికి అనుమతిస్తుంది.
248వ నిబంధనలోని సబ్‌క్లాజ్ 1 ప్రకారం.. సభాధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు రహస్య సమావేశ తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు.