ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం బాలయ్యనాయుడు ప్రతిష్ఠాత్మకమైన ఈఐసీబీఐ (యూరప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ)లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ అలియన్సెస్‌కు వైస్ ఛైర్‌గా నియమితులయ్యారు.
ఈఐసీబీఐని 2011లో ఏర్పాటు చేశారు. దీనికి యూరోపియన్ కమిషన్ రిజిస్ట్రేషన్, యూరోపియన్ పార్లమెంటు నుంచి జియోపొలిటికల్ ఫోరమ్ అక్రిడిషన్ ఉన్నాయి. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు.