తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అడవెల్లి రాజశేఖర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం 2025, ఏప్రిల్ 11న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఉపలోకాయుక్తగా జిల్లా, సెషన్స్ మాజీ జడ్జి బీఎస్ జగ్‌జీవన్‌కుమార్‌ను నియమించింది.
రాజశేఖర్‌రెడ్డి 1960 మే 4న నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సిర్సంగండ్ల గ్రామంలో జన్మించారు.