Published on Sep 26, 2024
Current Affairs
లింక్డ్‌ఇన్‌ 2024 జాబితా
లింక్డ్‌ఇన్‌ 2024 జాబితా

క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం అయిన జెప్టో వరుసగా రెండో ఏడాదీ ‘లింక్డ్‌ఇన్‌ టాప్‌ స్టార్టప్స్‌ ఇండియా లిస్ట్‌ 2024’లో అగ్రస్థానంలో నిలిచింది. వృత్తినిపుణులు పనిచేసేందుకు ఎక్కువ ఇష్టపడే కంపెనీల జాబితాను లింక్డ్‌ఇన్‌ 2024, సెప్టెంబరు 25న విడుదల చేసింది. 

అంతర్జాతీయంగా 100 కోట్ల మందికి  పైగా ఉన్న లింక్డ్‌ఇన్‌ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. అత్యధిక అంకురాలున్న నగరంగా బెంగళూరు కొనసాగింది.