మన దేశం నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.2 లక్షల కోట్లను అధిగమించాయని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇందులో ఐఫోన్ ఎగుమతుల విలువే దాదాపు రూ.1.5 లక్షల కోట్లని వెల్లడించారు. 2023-24లో జరిగిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులతో పోలిస్తే గతేడాది 54% వృద్ధి నమోదైంది. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ గత 10 ఏళ్లలో 5 రెట్లకు పైగా పెరిగిందని, ఎగుమతులు ఆరు రెట్లు అధికమయ్యాయని వైష్ణవ్ తెలిపారు.