వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగుల సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.
2025, ఫిబ్రవరి 20న దుబాయ్ కేంద్రంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
కోహ్లి (222 ఇన్నింగ్స్) ముందున్నాడు.
11 వేల వన్డే పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్ రోహిత్.