రోజుకు 5 లక్షల బ్యారెళ్ల (ఏడాదికి 25 మిలియన్ టన్నుల) చమురును పదేళ్లపాటు సరఫరా చేసే నిమిత్తం రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇప్పటివరకు రెండు దేశాల మధ్య జరిగిన ఇంధన ఒప్పందాల్లో ఇదే అతిపెద్దది.
10 ఏళ్ల ఒప్పందంలో భాగంగా, అంతర్జాతీయ సరఫరాలో 0.5% వాటాకు సమానమైన ముడిచమురును రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగుమతి చేసుకోనుంది.
ప్రస్తుత ధరల వద్ద చూస్తే, ఈ విలువ ఏడాదికి 12-13 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.02 - 1.1 లక్షల కోట్ల) మేర ఉంటుంది.