Published on Aug 23, 2025
Current Affairs
రష్యాలో వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ‘మ్యాక్స్‌’
రష్యాలో వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ‘మ్యాక్స్‌’

విదేశీ డిజిటల్‌ సర్వీసులపై ఆధారపడకుండా సొంత డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా సొంత యాప్‌ను రూపొందించింది.

ప్రతి ఒక్కరి మొబైల్‌ ఫోన్, ట్యాబ్లెట్‌లలో ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా ‘మ్యాక్స్‌’ను ఉంచాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

ఈ యాప్‌లో ప్రభుత్వ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.