ఉత్తర కొరియా-రష్యా దేశాలు తమ మధ్య రక్షణ బంధాన్ని కుదుర్చుకున్నాయి. తమలో ఏ ఒక్కరిపైనైనా శత్రుదేశం దాడి జరిగితే ఈ రెండూ ఒకదానికొకటి సహకరించుకునేలా కీలక రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి.
2024 జూన్‌లోనే దీనిపై సంతకాలు జరగగా దాన్ని ఉత్తర కొరియా 2024, నవంబరు 12న ఆమోదించింది. ఈ ఒప్పందాన్ని రష్యా ఇప్పటికే ఆమోదించింది.