తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి రిషిత రెడ్డి ఐటీఎఫ్ ప్రపంచ టెన్నిస్ టూర్ జూనియర్స్‌లో వరుసగా మూడో టోర్నీలోనూ విజేతగా నిలిచింది.
2024, డిసెంబరు 7న జరిగిన జే100 టోర్నీలో ఫైనల్లో రిషిత 6-2, 7-5 తేడాతో వతనాబె (జపాన్)ను ఓడించింది.
గత రెండు వారాల్లో రిషిత ఐటీఎఫ్ జే100, ఐటీఎఫ్ జే60 టోర్నీల్లోనూ విజయం సాధించింది.