రాష్ట్రాల స్వయం సాధికారత కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2025, ఏప్రిల్ 15న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని, సభ్యులుగా ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, తమిళనాడు ప్రణాళికా సంఘం మాజీ వైస్ ఛైర్మన్ నాగనాథన్ ఉంటారని వెల్లడించారు.