కేంద్ర విద్యుత్‌శాఖకు చెందిన ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)’ కాలుష్యరహిత విద్యుత్ (క్లీన్ ఎనర్జీ) ఉత్పత్తిలో ప్రతిభ కనబరుస్తోన్న రష్ట్రాల జాబితాను ‘రాష్ట్రాల ఇంధన సమర్థత సూచిక-2024’ పేరుతో ఇటీవల విడుదల చేసింది.
దేశంలోనే అత్యధికంగా 96.70% క్లీన్ ఎనర్జీ ఉత్పత్తితో హిమాచల్‌ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
హిమాచల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో జలవిద్యుదుత్పత్తి అధికంగా ఉన్నందున క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ముందున్నాయని నివేదికలో తెలిపింది.
కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 40.74%, తెలంగాణ 40.10 శాతంతో వరుసగా 16, 17 ర్యాంకుల్లో నిలిచాయి.