Published on Oct 27, 2025
Current Affairs
రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారాలు
రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారాలు

శాస్త్ర పరిశోధన విభాగాల్లో అద్భుత నైపుణ్యాలు ప్రదర్శించిన 24 మందికి కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన్‌రత్న, విజ్ఞాన్‌శ్రీ, విజ్ఞాన్‌ యువ-శాంతిస్వరూప్‌ భట్నాగర్, విజ్ఞాన్‌టీం పేరుతో నాలుగు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించింది. వివరాలను 2025, అక్టోబరు 26న వెల్లడించింది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన వారికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రకటించిన ‘రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌-2025’లను దక్కించుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు నలుగురు ఉన్నారు.

విజ్ఞాన్‌శ్రీ పురస్కారానికి ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగంలో ఎస్‌.వెంకటమోహన్, బయోలాజికల్‌ సైన్స్‌ విభాగంలో కె.తంగరాజ్‌... విజ్ఞాన్‌ యువ-శాంతిస్వరూప్‌ భట్నాగర్‌(వీవై-ఎస్‌ఎస్‌బీ) పురస్కారానికి అగ్రికల్చర్‌ సైన్స్‌ విభాగంలో జగదీష్‌గుప్త కాపుగంటి, సతేంద్రకుమార్‌ మన్‌గ్రౌతియాలు ఎంపికయ్యారు.