తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్-2025 అందుకున్నారు. 2025, డిసెంబరు 23న రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరు ఈ పురస్కారాలను స్వీకరించారు.
ఇందులో నాగ్‌పుర్‌లోని సీఎస్‌ఐఆర్ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఎస్.వెంకటమోహన్, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో సీఎస్‌ఐఆర్ భట్నాగర్ ఫెలోగా సేవలందిస్తున్న కుమారస్వామి తంగరాజ్‌లు విజ్ఞాన్‌శ్రీ పురస్కారాలు అందుకున్నారు.
దిల్లీలోని బీఆర్‌ఐసీ- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోం రీసెర్చ్‌లో స్టాఫ్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్న జగదీష్ గుప్త కాపుగంటి, హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సత్యేంద్రకుమార్ మంగ్రౌతియాలు విజ్ఞాన్ యువ పురస్కారాలు స్వీకరించారు.