Published on Sep 26, 2024
Government Jobs
రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు
రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం, గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ (ఆర్ఆర్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. అసోసియేట్ ప్రొఫెసర్

2. అసిస్టెంట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిసెర్చ్‌)

4. టీచింగ్ కమ్ రిసెర్చ్‌ ఆఫీసర్

5. రిసెర్చ్‌ ఆఫీసర్

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.

జీతం: నెలకు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.2,00,000-రూ.2,50,000; టీచింగ్ కమ్ రిసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు రూ.74,000-రూ.92,000; రిసెర్చ్‌  ఆఫీసర్ పోస్టులకు రూ.55,000-రూ.70,000; మిగతా పోస్టులకు రూ.90,000-రూ.1,15,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, హ్యూమన్ రిసోర్స్‌ సెక్షన్, రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, దహెగామ్, గాంధీనగర్, గుజరాత్.

దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2024.

Website:https://rru.ac.in/