రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్‌యూ), తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 05
వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 04
2. జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్ - 01
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్/స్లేట్ /సెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.37,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా swarn@bhu.ac.in కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 25-01-2026.
Website:https://rru.ac.in/events/applications-invited-for-the-teaching-and-non-teaching-positions-at-sicssl/