గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ మాత్రపు (14) 2024, డిసెంబరు 26న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2025’ను అందుకుంది.
స్కేటింగ్‌లో అసాధారణ కళాత్మకత చూపినందుకు ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం వరించింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొత్తం 7 విభాగాల్లో 17 మంది బాలలకు ఈ పురస్కారాలు అందించారు.