రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద వివిధ కేటగిరీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మొత్తం పోస్టులు: 74
వివరాలు:
1. ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 54
2. బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III- 3
3. జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ II- 2
4. నర్స్ గ్రేడ్ II- 1
5. టెక్నీషియన్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 4
6. టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 2
7. టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్)- 8
అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో టెన్త్ లేదా బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ, ఇంజినీరింగ్ (కెమిస్ట్రీ/ఫిజిక్స్), డిప్లొమా (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.02.2025 నాటికి ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 35 ఏళ్లు(నర్స్ గ్రేడ్ II పోస్టుకు 36ఏళ్‌లు), ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ఆపరేటర్/టెక్నీషియన్ ట్రైనీ, నర్స్ గ్రేడ్ II పోస్టులకు రూ.46,300; బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ IIIకు రూ.42,100; జూనియర్ ఫైర్‌మెన్ గ్రేడ్ IIకు రూ.37,900.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ/ ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు: ముంబయి, నాగ్‌పూర్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2025.
Website:https://www.rcfltd.com/hrrecruitment/recruitment-1
Apply online:https://ibpsonline.ibps.in/rcfdece24/