దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) ఐజీ-కమ్-ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమాసింగ్ ఠాకుర్ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. 1993 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన ఆమె హౌరా రైల్వే డివిజన్‌లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్‌గా ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ద.మ.రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
అలాగే రైల్‌నిలయంలో అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తమ్‌కుమార్ బంద్యోపాధ్యాయ్, ఆర్పీఎఫ్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రావుల శ్రీనివాస్, విజయవాడ డివిజన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కర్నాటి మహేశ్వరరెడ్డికి మెరిటోరియస్ సేవలకు పోలీస్ మెడల్స్ అందనున్నాయి.