దేశ సేవలో ప్రాణ త్యాగాలు చేసిన వీరుల గౌరవార్థం ‘పరమ్ వీర్ దీర్ఘ’ పేరుతో రాష్ట్రపతి భవన్‌లో చిత్రశాల (గ్యాలరీ)ను ఏర్పాటు చేశారు. పరమ్ వీర్ చక్ర అవార్డులు పొందిన 21 మంది ఫొటోలను ఇందులో ఉంచారు. దేశ రక్షణలో ధైర్యసాహసాలు చూపిన వారి గుర్తుగా, వీరుల గొప్పతనాన్ని సందర్శకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పారు. విజయ్ దివాస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, డిసెంబరు 16న ఈ చిత్రశాలను ప్రారంభించారు.
ఇప్పుడు ఏర్పాటు చేసిన ‘పరమ్ వీర్ దీర్ఘ’ స్థానంలో ఇది వరకు బ్రిటిష్ ఆర్మీ అధికారుల చిత్రాలు(ఏడీసీ-ఎస్) ఉండేవి.