రాష్ట్రపతి భవన్‌లో భాగంగా ఒక గ్రంథ్ కుటీర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జనవరి 23న ప్రారంభించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా సహా 11 ప్రాచీన భారతీయ భాషల పుస్తకాలు, రాతప్రతులకు చోటు దక్కింది. ఇందులో పురాణాలు, తత్వశాస్త్రం, భాష, చరిత్ర, పాలన, సైన్స్ లాంటి అంశాల పుస్తకాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ విభాగంలో వలస పాలనకు సంబంధించిన పుస్తకాలు ఉండేవి. తాజాగా వాటిని రాష్ట్రపతి ఎస్టేట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు.
గ్రంథ్ కుటీర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, దాతల తోడ్పాటుతో సిద్ధం చేశారు.