డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌వో) గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ఐఎస్‌వో ధ్రువపత్రం దక్కిన తొలి పంచాయతీగా రావులపాలెం రికార్డు సృష్టించింది. కేరళలోని పంచాయతీలకు ఇటువంటి ధ్రువపత్రాలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటివి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి 24 పంచాయతీలను ఎంపిక చేసి, మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన ఐఎస్‌వో ఆడిట్ బృందం రెండు రోజులుగా రావులపాలెంను పరిశీలించింది. అక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి ఐఎస్‌ఓ సర్టిఫికేట్ జారీ చేసింది.