Published on Apr 19, 2025
Current Affairs
రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్‌ శ్రీవాస్తవ
రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్‌ శ్రీవాస్తవ

కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ శ్రీవాస్తవ 2025, ఏప్రిల్‌ 18న నియమితులయ్యారు.

1994 బ్యాచ్‌ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీవాస్తవ, ప్రస్తుతం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

పౌరవిమానయాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ఈయన అసోం-మేఘాలయా క్యాడర్‌కు చెందినవారు.