Published on Nov 17, 2025
Current Affairs
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా
  • టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చోటు సంపాదించాడు. ఇప్పటిదాకా కపిల్‌దేవ్‌ (భారత్‌), డానియెల్‌ వెటోరి (న్యూజిలాండ్‌), ఇయాన్‌ బోథమ్‌ (ఇంగ్లాండ్‌) మాత్రమే ఈ క్లబ్‌లో ఉన్నారు. ఇప్పటికే అతడు 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
  • 2025, నవంబరు 15న కోల్‌కతా వేదికగా జరిగిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో జడేజా 4 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 పరుగులు, 342 వికెట్లు ఉన్నాయి.