Published on Dec 19, 2024
Current Affairs
రవిచంద్రన్‌ అశ్విన్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌

దాదాపు పదిహేనేళ్లపాటు భారత క్రికెట్‌కు సేవలందించిన ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (38) 2024, డిసెంబరు 18న అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తక్షణమే రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం అశ్విన్‌ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మూడు ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. భారత్, ఆసీస్‌ మధ్య అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు (గులాబీ బంతి) అశ్విన్‌ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌.

2010 జూన్‌ 5న శ్రీలంకతో వన్డేలో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. సుమారు 14 ఏళ్ల ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు.