Published on Mar 11, 2025
Current Affairs
రైల్వే బిల్లుకు ఆమోదం
రైల్వే బిల్లుకు ఆమోదం

రైల్వే (సవరణ) బిల్లు 2024కు రాజ్యసభ మూజువాణి ఓటుతో 2025, మార్చి 10న ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును 2024, డిసెంబరు 11న లోక్‌సభ ఆమోదించింది.

ఈ బిల్లు 1905 నాటి రైల్వే చట్టం స్థానంలో అమలులోకి వస్తుంది. రైల్వే బోర్డు మరింత స్వతంత్రంగా వ్యవహరించడానికి, దాని పనితీరును మెరుగు పరచడానికి దోహదపడుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.