Published on Dec 30, 2025
Government Jobs
రైల్వేలో గ్రూప్-డి పోస్టులు
రైల్వేలో గ్రూప్-డి పోస్టులు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 లెవల్‌-1 గ్రూప్‌-డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 32,000

వివరాలు:

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.

పోస్టులు: పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మొదలైనవి.

విభాగాలు: ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ మొదలైనవి.

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. 

ప్రారంభ వేతన: నెలకు రూ.18,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025.

గమనిక: పోస్టుల వారీ ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, సిలబస్‌ తదితర వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో విడుదల చేయనుంది.

Website:https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

Apply online:https://www.rrbapply.gov.in/#/auth/landing