పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారత ఎగుమతిదార్లకు ఊరటనిచ్చేందుకు కేంద్రం రూ.497 కోట్ల కేటాయింపుతో ‘రిలీఫ్’ పథకాన్ని (రిజైలెన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్‌వెన్షన్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ఫెసిలిటేషన్) ప్రారంభించింది. అలాగే వాణిజ్య, పెట్రోలియం- సహజవాయువు, ఓడలు- షిప్పింగ్, ఆర్థిక సేవలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఆర్‌బీఐ, సీబీఐసీ సహా పలు ప్రభుత్వ విభాగాలతో ఒక అంతర్‌మంత్రిత్వ బృందాన్ని (ఐజీఎం) కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఐజీఎం రోజూ సమావేశమై సరకు ఓడల కదలికల ఆధారంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది.
ఈ ‘రిలీఫ్’ పథకం కింద ప్యాకేజీని అమలు చేసే బాధ్యతను ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీజీసీ) నిర్వహిస్తుంది.