Published on May 31, 2025
Government Jobs
రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు
రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు

దిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (రైల్‌టెల్‌) వివిధ విభాగాల్లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు సంఖ్య: 48 (యూఆర్‌-21; ఓబీసీ-13; ఎస్సీ-08; ఎస్టీ-01; ఈడబ్ల్యూఎస్‌-08)

వివరాలు:

విభాగాలు: సిగ్నలింగ్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌

1. అసిస్టెంట్ మేనేజర్‌: 30

2. డిప్యూటీ మేనేజర్‌: 18

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌/బీఈ, డిప్లొమా, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 జూన్‌ 30 నాటికి అసిస్టెంట్ మేనేజర్‌కు 21 - 28 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 21 - 30 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.30,000 - రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్‌ 30.

Website:https://www.railtel.in/careers.html