Published on Jan 2, 2025
Government Jobs
రైల్‌టెల్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
రైల్‌టెల్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, న్యూదిల్లీ ఎస్సీ/ ఎస్టీ/ ఒబీసీ అభ్యర్థులకు బ్యాక్‌లాగ్ ఖాళీలతో సహా సాంకేతిక ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

మొత్తం పోస్టులు: 12

వివరాలు:

1. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): 9 పోస్టులు

2. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్): 3 పోస్టులు

అర్హతలు:

అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్): ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా ఆప్టికల్ ఫైబర్ కేబుల్, టెలికాం/డేటా నెట్‌వర్క్ నిర్వహణ తత్సమాన విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం.

డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్): సంబంధిత రంగాలలో బీఈ/బీటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హత.

వయసు: 

అసిస్టెంట్ మేనేజర్: 21 - 28 సంవత్సరాలు.

డిప్యూటీ మేనేజర్: 21 - 30 సంవత్సరాలు.

జీతం: 

అసిస్టెంట్ మేనేజర్: నెలకు రూ.30,000 - రూ.1,20,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000.

దరఖాస్తు రుసుము: రూ.1200 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600, పరీక్షలో పాల్గొన్న తర్వాత తిరిగి చెల్లించబడుతుంది).

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్షా విధానం: ప్రొఫెషనల్ నాలెడ్జ్ (100 మార్కులు), జనరల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు).

పరీక్షా కేంద్రాలు: ముంబయి, కోల్‌కతా, దిల్లీ, హైదరాబాద్/సికింద్రాబాద్.

పని ప్రదేశం: హైదరాబాద్/సికింద్రాబాద్.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 27 జనవరి 2025.

Website:https://www.railtel.in/