భారతదేశంలో ఉద్యోగార్థులకు అత్యంత ఆకర్షణీయ యాజమాన్య సంస్థగా టాటా గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. ర్యాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్- 2025 సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితాలో రెండు, మూడో స్థానాల్లో గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో 1,70,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ జాబితాను ర్యాండ్‌స్టడ్ రూపొందించింది. వీరిలో 3,500 మంది భారత్ నుంచి ఉన్నారు.