Published on Jun 5, 2025
Government Jobs
రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు
రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు

లఖ్‌నవూలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (డీఆర్‌ఆర్‌ఎల్‌ఐఎంఎస్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

1. ట్యూటర్‌: 02

2. ప్రిన్సిపల్ కమ్ ప్రొఫెసర్‌: 01

3. వైస్‌ ప్రిన్సిపల్ కమ్‌ ప్రొఫెసర్‌: 01

4. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(మెడికల్ సర్జికల్‌): 01

5. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌): 01

6. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(మిడ్‌వైఫెరీ/ఒబెస్ట్రిక్స్‌/గైనకాలజీ నర్సింగ్‌): 01

7. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌): 01

8. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొదింన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి ఎంఎస్సీ(నర్సింగ్‌), బీఎస్సీ(నర్సింగ్‌)/పోస్ట్ బేసిక్‌ బీఎస్సీ(నర్సింగ్‌), పీహెచ్‌డీ(నర్సింగ్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: ట్యూటర్‌ పోస్టుకు 40 ఏళ్లు, మిగతా పోస్టులన్నింటికి 50 ఏళ్లు.

వేతనం: నెలకు ప్రిన్సిపల్‌ కమ్‌ ప్రొఫెసర్‌, వైస్‌ ప్రిన్సిపల్ కమ్‌ ప్రొఫెసర్‌కు రూ.1,31,100 - రూ.2,16,600, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.78,800 - రూ.2,09,200, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.67,700 - రూ.2,08,700, ట్యూటర్‌కు రూ.47,600 - రూ.1,51,100.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.708.

ఎంపిక: ప్రిన్సిపల్‌ కమ్‌ ప్రొఫెసర్‌, వైస్‌ ప్రిన్సిపల్ కమ్‌ ప్రొఫెసర్‌కు ఇంటర్వ్యూ, మిగతా పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జూన్‌ 30.

Website:https://www.drrmlims.ac.in/recruitment