Published on Mar 13, 2025
Walkins
రిమ్స్‌ ఆదిలాబాద్‌లో వివిధ పోస్టులు
రిమ్స్‌ ఆదిలాబాద్‌లో వివిధ పోస్టులు

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 101

వివరాలు:

ప్రొఫెసర్- 04

అసోసియేట్ ప్రొఫెసర్- 14

అసిస్టెంట్‌ ప్రొఫెసర్- 30

ట్యూటర్‌- 15

సీనియర్ రెసిడెంట్‌- 6

సూపర్ స్పెషాలిటీ- 33

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరో సర్జన్, యూరాలజీ, రేడియాలజీ, సీఏఎస్ ఆర్ఎంఓ, సీఎంఓ, ట్యూటర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అండ్‌ డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: 18-03-2025.

వేదిక: ఆఫీస్ ఆఫ్‌ ది డైరెక్టర్, రిమ్స్‌ మెడికల్ ఆదిలాబాద్.

Website:https://rimsadilabad.org/