Published on Aug 31, 2024
Walkins
రిమ్స్‌, ఆదిలాబాద్‌లో వివిధ పోస్టులు
రిమ్స్‌, ఆదిలాబాద్‌లో వివిధ పోస్టులు

ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ (రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 97.

వివ‌రాలు:

1. ప్రొఫెసర్‌: 06

2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 27

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 20

4. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌: 03

5. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌-ఆర్ఎమ్ఓ: 02

6. చీఫ్ మెడికల్ ఆఫీసర్: 11

7. సూపర్ స్పెషాలిటీ విభాగంలో: 28

విభాగాలు: అనాటామీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, జనరల్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,90,000; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,50,000; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,25,000; మిగతా పోస్టులకు పోస్టుకు రూ.52,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 04-09-2024.

వేదిక: ఆఫీస్ ఆఫ్‌ ది డైరెక్టర్, రిమ్స్‌ మెడికల్ కాలేజ్, ఆదిలాబాద్‌.

Website:https://rimsadilabad.org/