Published on Apr 12, 2025
Government Jobs
రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీర్‌ పోస్టులు
రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీర్‌ పోస్టులు

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ) ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు:

1. ఇంజినీర్‌-ఎ(ఎలక్ట్రానిక్స్‌): 03

2. ఇంజినీర్‌-ఎ(ఫోటినిక్స్‌): 02

3. ఇంజినీర్‌ అసిస్టెంట్-సి(సివిల్): 01

4. అసిస్టెంట్: 04

5. అసిస్టెంట్‌ క్యాంటీన్‌ మేనేజర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 14వ తేదీ నాటికి ఇంజినీర్‌కు 35 ఏళ్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, అసిస్టెంట్ క్యాంటీన్‌ మేనేజర్‌కు 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 14.

Website:https://www.rri.res.in/careers/other-openings