- రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్‌ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటీ మద్రాస్ రూపొందించింది. మందుగుండుకు అమర్చే వినూత్న ఆర్టిలరీ షెల్‌ను ఆవిష్కరించింది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించామని, ఈ సాంకేతికతకు ‘రామ్‌జెట్’గా నామకరణం చేశామని ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. ఇది ఓ హైస్పీడ్ ఇంజిన్‌లా.. గాలిని అదిమిపట్టి, ఇంధనాన్ని ఉపయోగించి వేగంగా ముందుకెళ్లే థ్రస్ట్‌లా పనిచేస్తుందని వివరించింది.
- రేంజ్ పెంచుకునేందుకు రక్షణ దళాలు ఇప్పటికే వినియోగిస్తున్న తుపాకుల్ని మార్చకుండా.. ఈ సాంకేతికతను అన్వయించుకుంటే సరిపోతుందని తెలిపింది.