Published on Apr 15, 2025
Walkins
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు
రామగుండం ఫెర్టిలైజర్స్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

తెలంగాణ- పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), ఒప్పంద ప్రాతిపదికన అనుభవం గల మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

మెడికల్‌ ఆఫీసర్‌ (ఎంఓ)- 03 పోస్టులు:

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 29.02.2025 నాటికి 64ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 24.04.2025.

వేదిక: అడ్మిన్‌ బిల్డింగ్‌, ఆర్‌ఎప్‌సీఎల్‌ సైట్‌, రామగుండం.

Website:https://www.rfcl.co.in/