కేరళ రాష్ట్రం కొట్టాయంలోని రబ్బర్ బోర్డు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 50
వివరాలు:
ప్రాంతాల వారీగా: నార్త్ ఈస్ట్రన్ రీజియన్ -40; ఇతర రాష్ట్రాల్లో-10 (ఆంధ్రప్రదేశ్-01).
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ ఫారెస్ట్రీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (బోటనీ/ ప్లాంట్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
స్టెపెండ్: నెలకు రూ.40,000.
పని ప్రదేశాలు: దేశవ్యాప్తంగా ఉన్న రబ్బరు బోర్డు కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13-11-2024.
Website:https://rubberboard.gov.in/public
Apply online:https://recruitments.rubberboard.org.in/login.php