Published on Dec 3, 2024
Current Affairs
రంధావా స్మారక జాతీయ పురస్కారం
రంధావా స్మారక జాతీయ పురస్కారం

సీహెచ్‌ శ్రీనివాసరావు ఎన్‌ఎస్‌ రంధావా స్మారక జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్‌) డైరెక్టర్‌గా ఉన్నారు.

సహజ వనరుల పరిరక్షణ, నిర్వహణ, పర్యావరణ శాస్త్రాల్లో విశిష్ట సేవలకు గాను నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్సెస్‌ ఆయన్ను ఎంపిక చేసింది. 

2025, ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తరాఖండ్‌ పంత్‌నగర్‌లోని జీబీ పంత్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే 26వ వ్యవసాయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.