భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. 2025, సెప్టెంబరు 12న రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతులుగా బాధ్యతలు స్వీకరించిన 15 మందిలో 11 మంది రాజకీయవేత్తలు. మిగతా నలుగురిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, విద్యావేత్తలు, దౌత్యవేత్తలకు చోటుదక్కినట్లయింది. రాధాకృష్ణన్ పదవీకాలం 2030 సెప్టెంబరు 11 వరకు ఉంటుంది.