హైదరాబాద్ యువ టెన్నిస్ ఆటగాడు రిత్విక్ చౌదరి సిటా డి రొవెరెటో టెన్నిస్ టోర్నీలో శ్రీరామ్ బాలాజితో కలిసి ఛాంపియన్‌గా నిలిచాడు. 2024, నవంబరు 23న రొవెరెటో (ఇటలీ)లో జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్ రిత్విక్- బాలాజి జోడీ 6-3, 2-6, 12-10 తేడాతో రెండో సీడ్ థియో (ఫ్రాన్స్)- ఫ్రాన్సిస్కో (పోర్చుగల్)పై విజయం సాధించింది.
ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్ జే60 టోర్నీలో తెలంగాణ అమ్మాయి రిషిత రెడ్డి సింగిల్స్ టైటిల్‌తో మెరిసింది. నవంబరు 23న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 7-5, 6-4 తేడాతో ప్రియాంక రాణా (అమెరికా)ను ఓడించింది.