ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి ‘రాజయోగిని’ దాదీ రతన్ మోహిని అహ్మదాబాద్ ఆసుపత్రిలో 2025, ఏప్రిల్ 8న మృతిచెందారు. ఆమె వయసు 101 ఏళ్లు. దాదీ రతన్ మోహిని అసలు పేరు లక్ష్మి. ప్రస్తుత పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో 1925లో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే బ్రహ్మకుమారీల్లో చేరారు. దేశ విభజన సమయంలో రాజస్థాన్‌కు వచ్చారు. ఆమె పలు సందర్భాల్లో మొత్తం 70 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. బ్రహ్మకుమారీల శిక్షణ కేంద్ర నిర్వాహకురాలిగా దేశవ్యాప్తంగా ఉన్న 4,600 కేంద్రాల్లో సుమారు 46 వేల మంది బ్రహ్మకుమారీలను తీర్చిదిద్దారు.