టాటా గ్రూప్, ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన సోమర్‌విలే కాలేజ్ కలిసి రతన్ టాటా గౌరవార్థం ఒక ప్రతిష్ఠాత్మక భవనాన్ని నిర్మించనున్నాయి.
‘రతన్ టాటా బిల్డింగ్’గా దీనికి పేరు పెడతారు. దీని నిర్మాణం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని కొత్త రాడ్‌క్లిఫ్ అబ్సర్వేటరీ క్వార్టర్‌లో 2025 ప్రారంభంలో చేపడతారు.