Published on Mar 28, 2025
Current Affairs
రీతికకు రజతం
రీతికకు రజతం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రీతిక హుడా రజతం గెలుచుకుంది. 2025, మార్చి 27న అమ్మాన్‌ (జోర్డాన్‌)లో జరిగిన మహిళల 76 కిలోల విభాగం ఫైనల్లో ఆమె 6-7తో మెడిట్‌ కిజీ (కజకిస్థాన్‌) చేతిలో పోరాడి ఓడింది. 

మాన్సి (68 కేజీ), ముస్కాన్‌ (59 కేజీ) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పోరులో మాన్సి 12-2తో ఐరినా (కజకిస్థాన్‌)ను ఓడించింది. మరోవైపు ముస్కాన్‌ 4-0తో ఆల్టిన్‌ (మంగోలియా)పై గెలిచింది.