భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ (29) 2024, అక్టోబరు 24న ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది.
హరియాణాకు చెందిన ఈమె 16 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరఫున 254 మ్యాచ్‌లు ఆడి, దాదాపు 200 గోల్స్ చేసింది.
రాణి గౌరవార్థం ఆమె జెర్సీ నంబర్ 28కు రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ఇండియా, తనకు రూ.10 లక్షల నగదు బహుమతి కూడా అందజేసింది.